ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
Sun Jun 15, 2025 11:58 Business
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే, ఇటీవల గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రేటు రూ.99వేల వద్ద కొనసాగుతుంది. అయితే, రాబోయే కాలంలో తులం బంగారం ధర రూ.3లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణాలనుసైతం వారు వెల్లడిస్తున్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అధికారులు జెనీవాలో చర్చలు జరిపారు. మరిన్ని చర్చలు జరిపే నిమిత్తం టారిఫ్ యుద్ధానికి 90రోజుల విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ మేరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇంకా ఆమోదించలేదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా తగ్గించడానికి ఎలాంటి నిబంధనలు, పాటించాల్సిన చర్యలుపై ఇప్పటికీ ఇరు దేశాలు బహిరంగ ప్రకటనలు చేయపోవటంతో మార్కెట్ వర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాబోయే కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
3500 డాలర్లకు ఎలా చేరుతుంది..?
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సు బంగారం 3,371 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, చైనా వంటి కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటుండటం వంటి కారణాలను బట్టిచూస్తే బంగారం ధర రాబోయే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో 3500 డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే.. భారతదేశంలో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు సుమారు రూ.3లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా(America) సుంకాలు, కోర్టు తీర్పుల ప్రభావం..
అప్పీళ్ల ప్రక్రియ ముందుకు సాగుతున్నంత వరకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను అమలు చేయడం కొనసాగించవచ్చునని మంగళవారం ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు రద్దుచేయకపోతే జులై ప్రారంభం నాటికి అమల్లోకి వస్తాయి. ఇదే జరిగితే.. ధరలు పెరిగే అవకాశం ఉండటంతోపాటు.. పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంవైపు మొగ్గుచూపుతారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
మే నెలలోనూ వెనక్కు తగ్గని చైనా(China)..
చైనా(China) కేంద్ర బ్యాంకు మే నెలలో (వరుసగా ఏడవ నెలలో) తన బంగారం నిల్వలను మరింత పెంచుకుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన హోల్డింగ్‌లను 60,000 ట్రాయ్ ఔన్సులు పెంచింది. దీంతో దాని మొత్తం నిల్వలు 73.83 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరుకున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద కేంద్ర బ్యాంకులలో ఒకటి బంగారం నిల్వలను పెంచుకుంటుండటం రాబోయే కాలంలో బంగారం ధరల పెరుగుదలకు మరింత బలంచేకూర్చుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Business #GoldRate #America #China #HighPrice #Trade Tension #ComingDays #ViralNews #TodayNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.